మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలోని నిరుద్యోగ SC, ST, BC, మైనారిటీ అభ్యర్థుల కోసం 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. కే. రమేష్ తెలిపారు. అభ్యర్థుల వినతి మేరకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం చేస్తారు. శిక్షణ కాలంలో రూ. 3000 విలువైన పుస్తకాలు, 12 నోట్ బుక్స్, నెలవారీ కాస్మోటిక్స్ చార్జీలు అందిస్తారు.