తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా, జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలకు హాజరుకావాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాథోడ్ అవినాష్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ అవినాష్‌ను శ్రీకాంత్ రెడ్డి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు మోసిన్ తదితరులు పాల్గొన్నారు.