ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, గణేష్ మండలి నిర్వాహకుల సహకారంతోనే గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చేసినందుకు గాను మంగళవారం సనాతన హిందూ సమితి సభ్యులు ఎస్పీని కలిసి శాలువాతో సత్కరించి గణపతి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, రేణికుంట రవీందర్, సామనపల్లి నర్సింలు, సురేష్ పాడ్వాల్, మహిపాల్, ఎన్నావర్ రాజు, సుభాష్ ఉరాడే, విజయ్ తదితరులు పాల్గొన్నారు.