గౌతం మోడల్ స్కూల్ బస్సు టైరు ఊడి, విద్యార్థులకు స్వల్ప గాయాలు

1869చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతం మోడల్ స్కూల్ బస్సు ముందరి టైరు ఊడిపోవడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. యాపాలగూడ, శివఘాట్ ప్రాంతాల నుండి విద్యార్థులను తరలించే ఈ బస్సు విషయంలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 15 ఏళ్లు దాటిన ప్రైవేట్ బస్సులను వాడకూడదనే నిబంధన ఉన్నా, ఫిట్‌నెస్ లేని బస్సులను నడుపుతున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఘటనలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్