ఆదిలాబాద్ జిల్లాలో విద్యాంజలి ఏజెన్సీ నిరుద్యోగులను మోసం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని రాష్ట్రవ్యాప్తంగా 354 మంది నుంచి రూ. 6 కోట్లు వసూలు చేసి, రాత్రికి రాత్రే పరారైంది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా, ఏజెన్సీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో మైండ్ స్పార్క్, ఫిడిక్షన్ కంపెనీలు కూడా మెడికల్ కోడింగ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసి మోసం చేశాయి. బాధితులు ఆందోళనకు దిగి, కంపెనీ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.