మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి

1చూసినవారు
మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి
మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ. 10,000 కోట్లు ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం మహిళలకు వరం లాంటిదని పేర్కొన్నారు.