ఆదిలాబాద్: ఆదివాసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

78చూసినవారు
ఆదిలాబాద్: ఆదివాసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి
ఆదివాసీ గిరిజనులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం హర్షణీయమని తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేశ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. రోడ్డు, రవాణా, జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, తదితర వాటిపై సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్