ఆదిలాబాద్ పట్టణం శివాజీ చౌక్‌లోని మారెమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు డప్పు చప్పుళ్ల నడుమ బోనాలను నెత్తిన పెట్టుకుని ఆలయానికి శోభాయాత్రగా తరలివచ్చారు. అమ్మవారికి సామూహిక నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న,
బీజేపీ నేత పాయల్ శరత్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.