ఆదిలాబాద్ జిల్లా స్థాయి యువజనోత్సవాలు పట్టణంలోని జెడ్పి సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ట్రైని కలెక్టర్ సలోని, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.