బేలలో సబ్ పోస్ట్ ఆఫీస్ మంజూరు చేయాలని బీసీ సంఘం మండల అధ్యక్షుడు గోరే విశాల్ అన్నారు. శనివారం తహశీల్దార్ కోట్నాక రఘునాథ్ రావుకు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. బేలలో సబ్ పోస్ట్ ఆఫీస్ లేకపోవడంతో ఆర్డి ఖాతాలు, డిపాజిట్లు, విత్ డ్రాలకు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. సీసీఐ పత్తి చెల్లింపులు, సోయా చెల్లింపుల కోసం అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలన్నారు.