ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్

1చూసినవారు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో వాయుసేనకు చెందిన 362 ఎకరాల భూమి ఉంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు ఆ భూమిని పరిశీలించి, విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నదని నివేదిక ఇచ్చారు. అదనంగా మరో 700 ఎకరాలు సేకరించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. భూసేకరణ బాధ్యతను ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) కూడా సిద్ధమైందని సమాచారం. వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌కూ కేంద్ర అనుమతి లభించడంతో, జిల్లా ప్రజల్లో ఆనందం నెలకొంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే, ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకోనున్నాయి.

సంబంధిత పోస్ట్