
ఆస్కార్, నేషనల్ అవార్డుల్లో లాబీయింగ్.. పరేశ్ రావల్ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ నటుడు పరేశ్ రావల్ ఆస్కార్, నేషనల్ అవార్డుల విషయంలో లాబీయింగ్ జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల కంటే ప్రశంసలే ముఖ్యమని, నిష్పక్షపాతంగా అవార్డులు ఇవ్వాలని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, మూవీ టీమ్స్ కలిసి లాబీయింగ్ చేయడం సినిమా రంగానికి మంచిది కాదని పరేశ్ రావల్ అభిప్రాయపడ్డారు. గతంలో నేషనల్ అవార్డుల విషయంలోనూ, ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.




