ఆదిలాబాద్ రామ్ నగర్ హనుమాన్ ఆలయంలో ఆదివారం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి, ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్ళతో శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకల్లో ఆలయ పూజారి కిషోర్ శర్మ, గురుస్వాములు సురేందర్, శేఖర్, అడెల్లు, వికాస్, సౌరబ్ పాల్గొన్నారు.