దేవాల పూర్ణిమ సందర్భంగా ఉట్నూర్ మండలం ఎక్స్ రోడ్ లో నిర్వహించిన హీరా సుఖ జయంతి కార్యక్రమంలో ప్రధాన్ పురోహిత సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెస్రం మనోహర్ హాజరయ్యారు. హీరా సుఖ జయంతి అంటే దేవుల ఆశీర్వచనల కోసం ప్రజలు దీక్ష చేసి మోక్ష మార్గానికి దారి వెతుక్కునే రోజు అని ఆయన పేర్కొన్నారు. శరీరం లో ఆత్మ ఉన్నంతవరకే విలువ ఉంటుందని, ఆత్మ వెళ్ళిపోతే విలువ ఉండదని, అందుకే హీరా సుఖ అంటే మానవత విలువలను భగవంతుని కి సన్మార్గం ఇవ్వాలని కోరుకునే రోజు అని అభిప్రాయపడ్డారు. ఆదివాసీ దేవీ దేవతలను కాపాడటానికి హీరా సుఖ జ్ఞానం ఎంత కృషి చేసిందో సమాజం ఆలోచించి, ఆ మార్గంలో నడవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.