ఫిబ్రవరి 1న ఉట్నూర్ మండలం ఎక్స్ రోడ్ లోని హీరా సుఖ ఆలయంలో హీరా సుఖ జయంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎంపీ రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు పిలుపునిచ్చారు. ఆదివాసీ ప్రధాన్ పురోహిత సేవా సమితి రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గెడాం నిరంజన్ తో కలిసి ఆయన హీరా సుఖ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.