నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలి

ఆదిలాబాద్ పట్టణంలో అనేక సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని ఎంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి కుంటాల రామన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరుపేదలతో కలిసి ధర్నా చేపట్టారు. అర్హులైన పేదలకు కేటాయించిన స్థలాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి వారి సొంత ఇంటి కలలు నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్, చిన్నయ్య, మహేష్ పాల్గొన్నారు.
