ఆదిలాబాద్ నుంచి బైంసా వెళ్తున్న కారు ఇచ్చోడ మండలంలోని ముఖరా(బి) ఎక్స్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది.