ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధనోర (బి) గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆశా ట్రస్ట్, ఇంగ్లాండ్ ఆర్థిక సహాయంతో, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ ల్యాబ్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థుల్లో డిజిటల్ విద్య, కంప్యూటర్ పరిజ్ఞానం పెరుగుతుందని సర్పంచ్ జమున నాయక్, ఎంఇఓ మానుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ MEO నారాయణ, ఫౌండేషన్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్, హెచ్. ఎం అశోక్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ స్మార్ట్ ల్యాబ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.