ఇంద్రవెల్లి మండలంలోని హర్కాపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం ఓ కారు అదుపుతప్పి రోడ్డు దగ్గర ఉన్న గేదెను ఢీకొంది. ఈ సందర్బంగా గేదె అక్కడికక్కడే మృత్యువాత పడ్డగా, కారులో ఉన్న వారికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఘటన స్థలానికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు.