అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలు

2చూసినవారు
అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలు
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపును కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఐదు ఎస్‌ఎస్‌టి చెక్ పోస్టులలో 24 గంటలూ వాహనాల తనిఖీ జరుగుతుందని, రూ.50 వేలకు మించి నగదు ఉంటే తప్పనిసరిగా సరైన పత్రాలు చూపాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు స్వామి, ఫనిధర్, ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్