దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ఆందోళన దిగారు. TUWJ (IJU) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లకు వినతి పత్రం అందజేశారు. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. పని చేస్తున్న పాత్రికేయుల డిమాండ్ ల దినంగా పాటించాలన్నారు. యూనియన్ నాయకులు మాదస్తు రాజేశ్వర్, నూకల దేవేందర్, బీర్కుర్వార్ వెంకటేష్, వినోద్, సుధాకర్, అరుణ్, కిరణ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.