కాగజ్‌నగర్ మండలం బీఆర్ఎస్ కన్వీనర్ గా పార్వతి అంజన్నను బుధవారం ఆ పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రత్యక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేద్దామని సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ శ్యామ్ రావు అన్నారు.