తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఖానాపూర్ జిల్లాలోని ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు. జిల్లాల్లో కొనసాగుతున్న జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె నాగోబాను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు ఆలయ చరిత్ర, నాగోబా ప్రాశస్త్యం, జాతర ప్రాముఖ్యతను కవితకు వివరించారు.