ఆదిలాబాద్ పట్టణంలోని 7వ వార్డు కేఆర్కే కాలనీలో శ్రీ సాయి గణేష్ మండల్ ఆధ్వర్యంలో లడ్డూ వేలంశనివారం జరిగింది. ఈ ఏడాది లడ్డూను 7వ వార్డు కౌన్సిలర్ దుమ్మని రజిత రాము దంపతులు రూ. 42,100కు దక్కించుకున్నారు. బ్యాండ్ మేళాలతో లడ్డూను వారి ఇంటి వరకు తీసుకెళ్లారు. లడ్డూ దక్కించుకున్న దంపతులను కమిటీ సభ్యులు సన్మానించారు.