ఆదిలాబాద్ జిల్లాలో గురువారం జరిగిన సమావేశంలో మాదిగ జేఏసీ జిల్లా కన్వీనర్ గా లంక లలిత ను నియమించినట్లు జేఏసీ జిల్లా అధ్యక్షులు మనోజ్ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళలను చైతన్య పరిచి, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జి మోతే బారిక్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రాందాస్, గంగాధర్, మహేందర్, విలాస్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.