మార్చి 15న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న గోండి ధర్మ గురు హిరాసుకా లింగో జయంతి ఉత్సవాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. పర్ధాన్ కులస్తులు ఈ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ పర్ధాన్ జనజాతి ఉద్దాన్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్ర యాదవ్ రావు, జిల్లా అధ్యక్షుడు మెస్రం శంకర్, ప్రధాన కార్యదర్శి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.