కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి అంగవైకల్యం కలగదని డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా మైనారిటీ బాలుర పాఠశాలలో స్పర్ష్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుష్టు వ్యాధి పై అవగాహన పెంపొందించుకొని, కుష్టు వ్యాధిని అంతం చేయడానికి సహకరించాలని పిలుపునిచ్చారు.