ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్‌లోని అంగన్వాడీ కేంద్రాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని సంజయ్ నగర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో బాల్యవివాహాల నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందించి, బాల్యవివాహ రహిత సమాజాన్ని నిర్మించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.