నార్నూర్ మండలం జామిడి గ్రామంలో జరిగిన 9వ ఇప్ప పువ్వు పండుగ, అనాథ పిల్లల సంక్షేమ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. గిరిజన ఆర్థిక వ్యవస్థలో ఇప్ప పువ్వు కీలకమని, శాస్త్రీయ పద్ధతిలో సేకరించి విక్రయించడం ద్వారా గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి ఉత్సవాలు గిరిజన సంస్కృతిని భావితరాలకు అందిస్తాయని, ఐటిడిఎ ద్వారా రైతులకు, స్వయం సహాయక సంఘాలకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.