ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో ఆదివారం ఆదివాసీ పరదాన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి మహా సమ్మేళనం జరిగింది. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి అశోక్ ఉయికే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఘన స్వాగతం పలికి, కొమురం భీం విగ్రహానికి నివాళులర్పించారు. వివిధ జిల్లాల నుంచి పరదాన్ కులస్తులు భారీగా తరలివచ్చారు.