మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణలు చెప్పాలి

4చూసినవారు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ నాయకులు శ్రీరాం అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతున్న పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు వెంటనే పవన్ కళ్యాణ్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :