ఆదిలాబాద్: జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయండి

85చూసినవారు
ఆదిలాబాద్: జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయండి
ఈ నెల 10న నిర్వహించే జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ లో ఆయన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేసుకోవాలని అన్నారు. గ్రామ, వార్డు స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేసుకొని అర్హులైన పిల్లలకు అందించాలన్నారు.