జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా, స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలను జనవరి 12న ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఊరే గణేశ్, బాల శంకర్ కృష్ణ తెలిపారు. స్థానిక డైట్ మైదానం ఎదురుగా ఉన్న వివేకానందుని విగ్రహం వద్ద జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. యువత, యువజన సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.