భారత దేశ ఐక్యత కోసం మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని ఎంపీ నగేశ్ ఆదిలాబాద్‌లో సోమవారం అన్నారు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 12న జిల్లా కేంద్రంలో ఐక్యత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నేటి యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.