రోడ్డు ప్రమాదంలో ఎగిరిపడి వాడిలో పడ్డ వ్యక్తి మృతి

1903చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఎగిరిపడి వాడిలో పడ్డ వ్యక్తి మృతి
ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడ బ్రిడ్జి వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సాత్నాల మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందారు. వెనుక నుండి వస్తున్న వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో, ద్విచక్ర వాహనదారుడు ఎగిరి బ్రిడ్జి పై నుండి వాగులో పడిపోయాడు. తీవ్ర గాయాలతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వార్డు కౌన్సిలర్ మల్లన్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్