అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

0చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వరూర్ గ్రామానికి చెందిన దడాంజే వెంకట్రావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం గ్రామ శివారులోని పొలంలో అతిగా మద్యం తాగి పడి ఉన్న వెంకట్రావు చనిపోయి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టి, మృతదేహాన్ని రిమ్స్కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని కుమారులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్