మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశం బలోపేతమైందని పార్టీ జిల్లా అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ శనివారం పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నీతి నిజాయితీతో
రాజకీయాలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని పలువురు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.