ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ వారోత్సవాల్లో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అటవీ శాఖ ఉద్యోగులు మానవహారం చేపట్టారు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఇంధన ఆదా అవుతుందని, వారం రోజుల పాటు జరిగే అటవీశాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.