ఆదిలాబాద్ జిల్లాలోని ప్రణామ్ సెంటర్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం వృద్ధులకు వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పుత్లీబౌలి ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వృద్ధులకు వివిధ వైద్య
పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సమైక్య అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశ్పాండే, సభ్యులు నరసింహులు, శశికాంత్, రాంరెడ్డి, సత్యనారాయణ, రామ్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ వైద్య
పరీక్షలు నిర్వహించారు.