మే 2న ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర)లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు మీసేవ నోటిఫికేషన్‌కు సంబంధించిన అర్హత పరీక్ష నిర్వహించబడుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://adilabad.nic.in నుంచి లేదా తమ తహశీల్దార్ కార్యాలయం నుంచి పొందవచ్చని సూచించారు. ఈ పరీక్షలో కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్‌పై నలభై మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు.