లక్ష్మీపూర్ యువత సర్పంచ్ అభ్యర్థిగా మేకల దత్తుని ఎంపిక

6చూసినవారు
జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో, చదువుకున్న యువత సర్పంచ్ అయితేనే గ్రామాభివృద్ధి జరుగుతుందని భావించిన యువకులు, ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే, సహాయ సహకారాలు అందించే గ్రామ యువ నాయకులు మేకల దత్తుని తమ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. యువకులు అగ్గ మనోజ్ యాదవ్, ఆదివారం మేకల దత్తుని శాలువతో సత్కరించారు. గ్రామ యువతులంతా ఏకమై, పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా మేకల దత్తుని పోటీకి దించనున్నారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :