పంచాయతీ సమస్యలు పరిష్కరించకుంటే రాజీనామా: సభ్యుల హెచ్చరిక

4చూసినవారు
పంచాయతీ సమస్యలు పరిష్కరించకుంటే రాజీనామా: సభ్యుల హెచ్చరిక
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం బేతాల్ గూడ పంచాయతీ సభ్యులు గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించకుంటే పాలకవర్గం పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం జరిగిన గ్రామసభలో పాల్గొన్న సభ్యులు, కనీసం గ్రామపంచాయతీలో మౌళిక వసతులు లేకపోవడాన్ని నిరసిస్తూ గ్రామసభను బహిష్కరించారు. వసతులు కల్పించకుంటే రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెందూర్ హరికృష్ణతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్