కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాలూరి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంజిఎన్ఆర్ఈజిఏను నిర్వీర్యం చేసేలా వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకురావడాన్ని ఖండించారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 15 వరకు ఎంజిఎన్ఆర్ఈజిఏ బచావో సంగ్రామ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.