నేరడిగొండ మండలంలోని సావర్గం గ్రామంలోని జగదాంబ ఆలయంలో శనివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం భక్తులు ఆలయ తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి నిర్వాహకులకు సమాచారం అందించారు. హుండీతో పాటు అమ్మవారి ఆభరణాలను దొంగలు అపహరించినట్లు గుర్తించారు. సర్పంచి కల్యాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.