బోరజ్ మండలంలోని డోలహార గ్రామ సమీపంలో పెనుగంగా నదిలో సోమవారం ఇద్దరు విద్యార్థులు నీట మునిగారు. వీరిలో తరుణ్‌ను స్థానిక జాలర్లు రక్షించగా, కిరణ్ గల్లంతయ్యాడు. మంగళవారం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి కిరణ్ మృతదేహాన్ని వెలికితీసినట్లు ఎస్సై గౌతమ్ తెలిపారు.