ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయం ఎదుట గత 20 రోజుల నుండి గిరిజన శాఖ సిఆర్టి ఉపాధ్యాయులు చేపడుతున్న నిరవధిక సమ్మె వద్దకు చేరుకొని ఉపాధ్యాయులకు నిమ్మరసం ఇచ్చి సమ్మెను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన శాఖను పూర్తిగా విస్మరించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సిఆర్టిల సమస్యలను తీసుకెళ్లామని తెలిపారు.