స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి, ఘన నివాళి సమర్పించారు. అనంతరం ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. మహనీయుల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, దళిత సంఘాల నాయకులు ఉన్నారు.