ఆదిలాబాద్ పట్టణాన్ని రాష్ట్రాన్నే తలదన్నేలా ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదివారం 9వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనూషతో కలిసి మురికికాలువ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అమృత్ పథకం ద్వారా రూ. 100 కోట్ల నిధులతో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.