ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నియామవళిని ఉల్లంఘించి బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామ పంచాయతీలకు రూ. 25 లక్షల నిధులు ఇస్తామని చెప్పారని బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాజిద్ ఉద్దీన్ ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే ఓటర్లను, గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం సరికాదని, ఈ నెల 4న సీఎం సభ కూడా కోడ్ ఉల్లంఘన కిందే వస్తుందని ఆయన అన్నారు.