తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కంచం లక్ష్మణ్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. జిల్లాలో ముదిరాజ్ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లక్ష్మణ్ పేర్కొన్నారు. తన నియామకానికి జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.